1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: ఆదివారం, 31 అక్టోబరు 2021 (19:26 IST)

నిలబడతా.. పారిపోయే వ్యక్తిని కాదు: విశాఖలో పవన్ కళ్యాణ్

విశాఖ: స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు.

నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికుల వైపే నిలబడాలని శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవిత చదివి వినిపించారు. ఉక్కు పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉక్కు ప్రైవేటీకరణ వద్దని అమిత్‌షాను కోరినట్లు చెప్పారు.

కేంద్రాన్ని అడిగేముందు రాష్ట్ర పాలకులను బాధ్యులను చేయాలన్నారు. విశాఖ ఉక్కు ఎవరి భిక్ష కాదని.. కార్మికుల పోరాటం వల్లే అనేక పరిశ్రమలు మిగిలాయన్నారు. సమస్యలు వస్తే నిలబడతా.. పారిపోయే వ్యక్తిని కానని వెల్లడించారు.