గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (16:43 IST)

వైద్య సీట్ల భర్తీకి అర్హత మార్కులు "సున్నా"

నీట్ పీజీ వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే మూడో విడత సీట్ల ఎంపికలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండో‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను సున్నాగా పేర్కొంది. అన్ని కేటగిరీలలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. కటాఫ్ మార్కులను తొలగించిన నేపథ్యంలో మూడో రౌండ్లో పీజీ సీట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. 
 
ఇప్పటికే మూడో రౌండ్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆప్షన్లను మాత్రం మార్చుకోవచ్చని సూచించింది. అర్హత పర్సంటైల్‌ను తగ్గించిన కారణంగానే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను సున్నాకు తగ్గించామంది. 
 
ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు కటాఫ్ మార్కులను 291గా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257, దివ్యాంగులకు 274గా పేర్కొని మొదటి రెండు రౌండ్‌లో కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు. తాజాగా అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు (నీట్ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు) పొందినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లుగా నిబంధనలు మార్చారు.