శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (22:13 IST)

'వైఎస్సార్ నేతన్న నేస్తం' వాయిదా

ఈ నెల 16 నుండి ప్రారంభమౌతున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈ నెల 17న నిర్వహించ తలపెట్టిన “వైఎస్సార్ నేతన్న నేస్తం” కార్యక్రమాన్ని ఈ నెల 20 కి వాయిదా వేసినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ మరియు ప్రభుత్వ ఎక్స్అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు 6 నెలల ముందుగానే వైఎస్సార్ నేతన్న నేస్తం కింద వరుసగా రెండవ ఏడాది రూ. 24వేలు ఆర్ధిక సాయం అందించే కార్యక్రమాన్ని జూన్ 17 న నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించిందని, కాని మంగళవారం నుంచి  అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న దృష్ట్యా కార్యక్రమాన్ని ఈ నెల 20కి వాయిదా వేయడం జరిగిందన్నారు.

చేనేత రంగం ఆధునికీకరణకు, మర మగ్గాల పోటీని తట్టుకుని నిలబడేందుకు ఉద్ధేశించిన ఈ ఆర్థిక సాయం ద్వారా 69,308 మంది కుటుంబాలకు నేరుగా వారి ఖాతాల్లో ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీట నొక్కి జమ చేస్తారని తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి  తెలిపారు.