శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (14:27 IST)

ప్రకాశం జిల్లా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం : 27 వేల మంది కరోనా నమూనాలు వృథా

ప్రకాశం జిల్లా వైద్య సిబ్బంది విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా 27 మంది కరోనా అనుమానితుల నుంచి సేకరించి శ్వాబ్ నమూనాలు వృథా అయ్యాయి. దీంతో ఆ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది సేకరించిన నమూనాలకు ఐడీ నంబర్లు వేసి, సీల్ చేయడంలో అధికారులు పొరపాట్లు చేశారని, కనీసం మూత కూడా పెట్టకుండానే ప్రయోగశాలలకు పంపుతున్నారని ఆయన మండిపడ్డారు. దీంతో టెస్టింగ్ కేంద్రాల్లో నమూనాలన్నీ పక్కన పడేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 
 
ఒంగోలుతో పాటు పొదిలి అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన, అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షింబోమని హెచ్చరించారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది కరోనా టెస్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. 
 
సేకరించిన ప్రతి నమూనానూ నిర్ణీత వ్యవధిలోనే ల్యాబ్‌లకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఒక్కో పరీక్షలు ప్రభుత్వం రూ.1000 ఖర్చు చేస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని హితవు పలితారు.