ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (08:32 IST)

దుష్ట సమాజంలో ఉండొద్దన్నాడు.. నా తండ్రి శివుడి వద్దే ఉన్నాడు...

ఈ దుష్ట సమాజంలో ఉండొద్దని శివుడు చెప్పాడని, పైగా, తన తండ్రి కూడా శివుడి వద్దే ఉన్నాడని అందుకే తాను కూడా అక్కడికే వెళుతున్నట్టు చెప్పి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చాట్లమడ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన వెంకట పూర్ణ శేఖర్ రెడ్డి అనే యువకుడు చెన్నైలో ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. చిన్నపుడే తండ్రి చనిపోవడంతో తల్లి, చెల్లితో కలిసి ఉంటూ, వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి చెన్నై సొంతూరికి వచ్చేసిన పూర్ణశేఖర్ ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ దుష్ట సమాజంలో ఉండొద్దని శివుడు చెప్పాడని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. తన తండ్రి కూడా శివుడు వద్దే ఉన్నాడనీ, తాను కూడా ఆయన వద్దకే వెళ్లిపోతున్నానని తెలిపారు.
 
తన సోదరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, ఆస్తులన్నీ ఆమె పేరుమీద రాయాలని బంధువులకు సూచించాడు. అయితే, పూర్ణ శేఖర్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్న అంశాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. శివుడు పిలుస్తున్నాడంటూ ఉరేసుకున్నాడా? లేదా ప్రేమ వ్యవహారమా? అనేది తెలియాల్సివుంది.