సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (10:45 IST)

వైకాపా నేతను లారీతో ఢీకొట్టించి చంపిన దండగులు

murder
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అధికార వైకాపా నేతను కొందరు దుండగులు లారీతో ఢీకొట్టించి హత్య చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి హింసాత్మకంగా మారే అవకాశం ఉండటంతో అదనపు బలగాలను మొహరించారు. 
 
పాతకక్షల నేపథ్యంలో వైకాపా నేత పసుపులేటి రవితేజను కొందరు దండుగులు గురువారం  కొందరు దండగులు లారీతో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ విషయం తెలియడంతో సింగరాయకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులు హత్యకు ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. 
 
మరోవైపు, తమ పార్టీ నేత హత్యకు నిరసంగా వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగారు. వీరిపై పోలీసులు తమ లాఠీలను ఝుళిపించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపతప్పాయి. లారీకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని కూడా తగలబెట్టారు. ఈ ప్రాంతంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు బందోబస్తును నిర్వహిస్తున్నారు. వైకాపా నేతల ఆందోళనలు హింసాత్మకంగా మారకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.