బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (23:25 IST)

నేను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలి.. దళిత నేత డిమాండ్

YSRCP MLA MS Babu
YSRCP MLA MS Babu
పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.  తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. 
 
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసలను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని ఆయన ఫైర్ అయ్యారు. తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాల్సిందేనని.. తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనకు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. దళితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
 
తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని బాబు ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని గుర్తు చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎంఎస్ బాబు వెల్లడించారు.