శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (19:16 IST)

గుంటూరులో కొండచిలువ- మూడు కోళ్ళను మింగేసింది..

గుంటూరులో కొండచిలువ కలకలం సృష్టించింది. మేత మేస్తున్న నాలుగు కోళ్లను మింగి తచ్చాడింది. దీంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండవల్లి గ్రామంలోకి తెల్లవారిజామున వచ్చి

గుంటూరులో కొండచిలువ కలకలం సృష్టించింది. మేత మేస్తున్న నాలుగు కోళ్లను మింగి తచ్చాడింది. దీంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండవల్లి గ్రామంలోకి తెల్లవారిజామున వచ్చిన ఓ కొండ చిలువ వచ్చింది. రాగానే ఓ ఇంటిముందు తిరుగుతూ.. అక్కడ ఉన్న నాలుగు కోళ్లను మింగేసింది. 
 
మరికొన్ని కోళ్ళు కొండచిలువను చూసి కొక్కొరొక్కో అంటూ అరవడం మొదలుపెట్టాయి. దాంతో ఇంట్లోని వ్యక్తులు బయటకు చూశారు. అంతే ఒక్కసారిగా కొండచిలువను చూసి షాక్‌కు గురయ్యారు. 
 
కోళ్ళను మింగిన కొండచిలువ వాటిని బయటకు ఉమ్మి వేయడం చూసి వారు భయాందోళనకు గురయ్యారు. తర్వాత అతికష్టం మీద దాన్ని మట్టుబెట్టారు. కోళ్లను మింగేసిన కొండచిలువ అటూ ఇటూ తిరిగింది. దీంతో గ్రామస్థులు పరుగులు తీశారు. చివరికి కోళ్ళను బయటకు నెట్టేసిన పామును గ్రామస్థులు మట్టుబెట్టారు.