రమణదీక్షితులు గారూ... మీరు శ్రీవారి సేవ చేస్తున్నారా, జగన్ సేవ చేస్తున్నారా? ఎవరు?
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతి జనసేన పార్టీ నాయకులు. శ్రీవారి సేవ వదిలేసి రమణదీక్షితులు జగన్ సేవ మొదలెట్టారని మండిపడ్డారు. వైసిపి కండువా కప్పుకుని ఆ పార్టీ అధికార ప్రతినిధిగా రమణదీక్షితులు మాట్లాడొచ్చు అన్నారు.
రమణదీక్షితుల వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు తింటున్నాయని.. శ్రీవారి సేవలో ఉన్న వ్యక్తికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. రమణదీక్షితులను వదిలేస్తే తిరుమలలో జగన్‌మోహన్ రెడ్డికి గుడి కట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. వేరే పార్టీకి గాజు గ్లాసు గుర్తు రావడం వైసిపి వ్యూహమని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ముందు తేల్చుకుంటామన్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన తరువాత వైసిపి నేతలకు నిద్ర లేకుండా పోయిందని, అందుకే అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. మంత్రులకు భయం కాబట్టే తిరుపతిలో తిష్టవేసి జనసేన.. బిజెపిపై లేనిపోని విమర్సలు చేస్తున్నారన్నారు.