శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 23 జనవరి 2020 (19:37 IST)

మాకు ప్రత్యేక రాయలసీమ కావాలంటూ డిమాండ్, ఎవరు?

హైదరాబాద్‌లో మాజీ మంత్రి మైసూరా రెడ్డి ఇంట్లో గ్రేటర్ రాయలసీమ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శివరామ కృష్ణారావు, ఏపీ మాజీ డిజిపి దినేష్ రెడ్డిలు హాజరయ్యారు. 
శాసన మండలిలో బిల్లు పాస్ కాకపోతే గ్రేటర్ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి లేదా రాయలసీమ రాష్ట్రం ఇవ్వండి.
 
గ్రేటర్ ( నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి) మా రాయలసీమ మాకు రాష్ట్రంగా ఇవ్వండి అనే ప్రధాన డిమాండ్‌గా సమావేశంలో సభ్యులు అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. శ్రీబాగ్ ఒప్పందంలో స్పష్టంగా రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని ఉంది. 
 
మరి హైకోర్టు ఇచ్చి సరిపెట్టుకుంటే ఎలా? ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబాటుతనానికి గురి అవుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చూసి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు రాయలసీమ నేతలు.