శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (13:52 IST)

కేటీఆర్ బావమరిది సంస్థలో డేటింగ్‌కు అవకాశం : రేవంత్ రెడ్డి

తెరాస నేత, తాజా మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ బావమరిదికి చెందిన ఈవెంట్స్ నౌ సంస్థ యువతీయువకుల డేటింగ్‌కు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. 
 
రేవంత్ రెడ్డిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్టు  ఈవెంట్స్ నౌ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, క్రీడలు నిర్వహించాల్సిన గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజికల్‌ నైట్‌, డేటింగ్‌ పార్టీలు నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 
 
కేసీఆర్‌ కుటుంబం యువతను వ్యసనపరులుగా మారుస్తోందని మండిపడ్డారు. డ్రగ్స్‌ అమ్మకాల్లో కేసీఆర్‌ బంధువుల ప్రమేయం ఉండటంతోనే నిరుడు నమోదైన కేసు నివేదిక బయటకు రాకుండా అకున్‌ సభర్వాల్‌ను సెలవుపై పంపారన్నారు. 
 
ముఖ్యంగా, కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు చెందిన ఈవెంట్స్‌ నౌ సంస్థ మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమంలోనే డేటింగ్‌కు అవకాశం కల్పిస్తోందన్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ఈసీ చర్యలు తీసుకోవాలని, లేకపోతే తామే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.