బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (11:22 IST)

సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి... అవుటర్‌లో ఆపి ప్రయాణీకుల వద్ద..?

indian rail
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో నిన్న అర్ధరాత్రి దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండగులు కత్తిరించారు. 
 
సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లో ఆగిపోయింది. రైలు ఆగగానే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. 
 
ఎస్-5, ఎస్-7 బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.