రోహిణి కార్తె వచ్చింది బీ అలర్ట్- జూన్ 7 వరకు అలెర్ట్
అసలే ఎండలు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమయ్యింది. రోహిణి కార్తె జూన్ 7వ తేది వరకూ కొనసాగనుంది. అయితే, రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయన్న నానుడి వుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు అలర్ట్ జారీ చేసింది.
ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.