శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 10 జులై 2021 (23:04 IST)

గుంటూరులో సేవ్ ఫుడ్, సేవ్ లైఫ్

గుంటూరులో సేవ్ ఫుడ్ సేవ్ లైఫ్ కార్య‌క్ర‌మం జోరుగా సాగుతోంది. ఇక్క‌డి న‌గ‌ర ప్ర‌జ‌లు ఆహారాన్ని వృధా చేయ‌కుండా, కావాల్సిన వారికి, అన్నార్తుల‌కు పెట్టాల‌నే సంక‌ల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మాన్ని చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఫుడ్ వ్యాన్ల‌లో ఫ్రిడ్జ్ ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

గుంటూరు నగరంలోని గాంధీ పార్క్ వద్ద  నగరపాలక సంస్థ  ఆధ్వర్యంలో...  మిగిలిన ఆహార పదార్థాలను సేకరిద్దాం, ఆకలిని తరిమేద్దాం అనే కార్యక్రమానికి అద‌న‌పు సౌక‌ర్యాలు స‌మ‌కూర్చారు. పేదల ఆకలి తీర్చటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు తెలిపారు.

ఇర‌వై లక్షల రూపాయల ఖర్చుతో ఆహార నిల్వ చేసే ఫ్రిజ్ లను శ‌నివారం సాయంత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్,నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తాఫా, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కమిషనర్ అనురాధ ప‌రిశీలించారు. ఈ ఫ్రిజ్ ల‌ను సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రారంభిస్తార‌ని నగర మేయర్ చెప్పారు.