శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (10:00 IST)

కరోనా కల్లోలం ... స్టాక్ మార్కెట్‌నూ వైరస్ .. నష్టాలే నష్టాలు

కరోనా కష్టాలు ప్రతి ఒక్కరినీ చుట్టుముట్టాయి. చివరకు దేశీయ మార్కెట్లను సైతం వదిలిపెట్టలేదు. ఫలితంగా స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలిపోతున్నాయి. సోమవారం ఉదయం దేశీయ మార్కెట్ల ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే, అవి నష్టాలతోనే మొదలయ్యాయి. 
 
కరోనా కల్లోలం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్న విషయం తెల్సిందే. దీంతో దేశీయంగా కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. సెన్సెక్స్ ప్రారంభంలోనే వెయ్యి పాయింట్లను కోల్పోయింది. బ్యాంకులు, ఫార్మా రంగ షేర్లతో పాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. 
 
ప్రస్తుతం సెన్సెక్పస్ 839 పాయింట్లు పతనమైన 28998 వద్ద, నిప్టీ 218 పాయింట్లు నష్టంతో 8452 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా 29 వేల దిగువకు చేరింది. నిప్టీ కూడా 8400 దిగువకు చేరింది. నిఫ్టీ బ్యాంకు కూడా ఇదే బాటలో వుంది. 
 
బజాజ్  ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, యూపిఎల్, శ్రీసిమెంట్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కాగా టీసీఎస్, ఐటీసీ మాత్రం స్వల్పంగా లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో రుపీ కూడా నెగిటివ్‌గా వుంది.