తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం : ధర్మారెడ్డికి కష్టాలు తప్పవా?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ తంతు జరిగింద. ఆ సమయంలో తితిదే ఈవోగా పని చేసిన ఏవీ ధర్మారెడ్డి వరుసగా రెండోసారి విచారణకు హాజరయ్యారు. మంగళవారం జరిగిన విచారణలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టేందుకు రెండో రోజూ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.
మరోవైపు తిరుమల పరకామణి చోరీ ఘటనపై సిట్ విచారణ కొనసాగుతోంది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో అధికారులు విచారిస్తున్నారు. రెండోసారి విచారణకు సీఐ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. పరకామణి చోరీ సమయంలో తిరుమల వన్‌టౌన్ పీఎస్‌లో ఆయన పనిచేశారు. విచారణకు పలువురు తితిదే అధికారులు కూడా హాజరయ్యారు.