శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 మే 2020 (09:45 IST)

సింహాచలం ఆలయంలో పాము

లాక్‌డౌన్‌తో పలు దేవాలయాల్లో భక్తుల ప్రవేశాన్ని నిషేధించడంతో..వన్య ప్రాణులు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇటీవల శ్రీశైలం మార్గంలో నెమళ్లు సంచరించిన సంగతి తెలిసిందే.

తాజాగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి 9 అడుగులకు పైగా ఉన్న పాము ఒకటి ప్రవేశించింది. తొమ్మిది అడుగుల పొడవున్న ఈ విషసర్పాన్ని ఆలయ ఉప ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు ఒడుపుగా పట్టుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఆలయంలోకి పాములు తరచూ వస్తూనే ఉంటాయని, కానీ సీతారామాచార్యులు వాటిని చాకచక్యంగా పట్టుకుని దూరంగా తోటల్లో వదిలేస్తారని సిబ్బంది అన్నారు.