శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (16:35 IST)

పవన్ కల్యాణ్‌నే కాదు.. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు.. వదిలేస్తాడు..

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా జనసేనతో పొత్తు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. 'వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని కార్యకర్తలు కోరారు. ఈ సందర్భంగా.. లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులా ఉండాల'ని వ్యాఖ్యానించారు. ఏకపక్ష లవ్ సరికాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చంద్రబాబు నేడు (డిసెంబరు 7) స్పష్టత ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు ఉంటాయని అన్నారు.  
 
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. 
 
చంద్రబాబు కామెంట్స్‌ను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ''చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు.. వదిలేస్తాడు.. ఆయన అవకాశ వాది. ఎవరినైనా ఏ సందర్భంలోనైనా లవ్ చేస్తాడు. తర్వాత ఆయన పాత్ర ఏంటో చూపిస్తాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.'' అని సోము వీర్రాజు మాట్లాడారు.