మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (19:11 IST)

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామా ఆమోదం

ganta srinivasa rao
తెలుగుదేశం పార్టీకి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తేరుకోలేని షాకిచ్చారు. గతంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి మద్దతు ఇస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గత రెండు యేళ్ల పాటు పెండింగ్‌లో ఉంచిని స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇపుడు ఉన్నట్టుండి రాజీనామాపై ఆమోదముద్ర వేశారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఏపీలో త్వరలోనే మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సివుంది. ఏపీలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, టీడీపీ తరపున గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగాల్సివుంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓటు హక్కు అత్యంత కీలకం. సరిగ్గా రాజ్యసభ ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస రావు మాజీగా వైకాపా స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆయన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయారు. 
 
ఇది టీడీపీతో పాటు అటు గంటా శ్రీనివాస రావుకు కూడా మింగుడు పడని అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో అప్రమత్తమైన టీడీపీ.. తమ పార్టీ తరపున గెలిచి వైకాపాకు మద్దతు ఇస్తున్న రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై కూడా తక్షణం చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయంపై ఒత్తిడి తెస్తుంది. అలాగే, వైకాపా రెబెల్స్ ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలకు కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.