శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 11 జూన్ 2021 (19:04 IST)

మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి: ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఇటీవలి వరకు కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ ప్రభుత్వ పరిపాలనాపరమైన బదిలీలలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. 
 
శుక్రవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి ఆశాఖ ఉన్నతాధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా ఇంతియజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధన్యతల మేరకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు.
 
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందని, అవి క్షేత్ర స్థాయికి చేరేలా అధికారులు శ్రద్ద వహించాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇంతియాజ్‌ను ముస్లిం మత పెద్దలు సన్మానించారు. మైనారీలు ఎదుర్కుంటున్న పలు అంశాలను ప్రత్యేక కార్యదర్శి దృష్టికి తీసుకురాగా, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.