ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:24 IST)

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయ కవాట బంధనము

ఈరోజు సాయంత్రం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవారికి పంచహారతులు నిర్వహించిన అనంతరం దేవాలయ కవాట బంధనము చేయబడినది.

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శార్వరీ నామ సంవత్సర జ్యేష్ట బహుళ అమావాస్య రోజున అనగా ది.21-06-2020 ఆదివారము నాడు మృగశిర, ఆరుద్ర నక్షత్రములలో మిధున రాశి, యందు రాహుగ్రస్త సూర్యగ్రహణము( గ్రహణం స్పర్శ కాలము: ఉ.10.25 నిం.లు, గ్రహణ మధ్య కాలము: మ.12.08 నిం.లు, గ్రహణ మోక్షకాలము :  మ.01.54 నిం.లు)  ఏర్పడుచున్నది.

ఈ సందర్భముగా ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ సభ్యుల వారి సూచన మేరకు ఆగమ శాస్త్ర ప్రకారముగా దేవాలయము ఈరోజు సాయంత్రం శ్రీ అమ్మవారికి పంచహారతులు నిర్వహించిన అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు సమక్షంలో ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుబట్ల శివ ప్రసాద శర్మ పర్యవేక్షణలో దేవాలయ కవాట బంధనము చేయబడినది.

తిరిగి  గ్రహణానంతరం ది.21-06-2020 ఆదివారము మ.2 - 30 గం.లకు  ఆలయము శుద్ధి పరచి, ప్రధానాలయ మరియు ఉపాలయముల దేవతామూర్తులకు స్నపనాది కార్యక్రమములు నిర్వర్తింపజేసి శ్రీ అమ్మవారికి పంచహారతులు నిర్వహించిన అనంతరం సా.07 గం.లకు ఆలయము యధావిధిగా మూసివేయబడి, మరుసటి రోజు అనగా ది.22-06-2020 ఉదయం 06 గం.లకు యధావిధిగా భక్తులను అమ్మవారి దర్శనము నకు అనుమతించబడునని, ఈ సందర్భముగా ది.21-06-2020 ఆదివారము రోజున  జరుగు అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేయడమైనదని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు తెలిపారు.