శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 మే 2020 (05:20 IST)

మడ అడవుల నరికివేతపై స్టేటస్ కో

మచిలీపట్నంలో మడ అడవుల నరికివేతపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది.

మడ అడవులు నరికి పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీకి శ్రీకారం చుట్టిందని ఇద్దరు మత్స్యకారులు పిటిషన్ దాఖలు చేశారు.

అడవి నరికివేత చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో అడవుల నరికివేతపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీనిపై 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.