ప్రత్యేక హోదాపై ప్రజల్లో స్పందన లేకపోతే నేనొక్కడినే ఏం చేసేది? పవన్ కామెంట్స్

pawan kalyan
ఎం| Last Modified సోమవారం, 5 ఆగస్టు 2019 (22:16 IST)
భీమవరంలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు. భవన నిర్మాణ కార్మికులందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక పాలసీ వెంటనే తీసుకురావాలని జగన్‌ను కోరుతున్నాను. భీమవరంలో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును వైసీపీ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి.

పోలవరం ప్రాజెక్ట్ పై రాజకీయాలు చేస్తే తగదు, వ్యక్తిగత కక్షల వల్ల ప్రాజెక్టుకు నష్టం. పోలవరం ప్రాజెక్ట్ పనులను నిలిపివేయడం వెనుక ఏదో కోణం ఉందనే అనుమానం ఉంది. జాప్యం చేస్తే మరింత వ్యయం పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించాలి.

పునరావాసం ఇవ్వకపోవడంతో నేడు వరదలతో ముంపు బారిన పడ్డారు. పర్యావరణ విషయంలో కూడా చాలా నష్టం జరుగుతుంది. అమరావతి విషయంలో అవినీతి వెలికితీస్తామని 20 వేల మంది ఉపాధి దెబ్బతీశారు. అమరావతి కట్టడాలను ఎందుకు ఆపారు, కాంట్రాక్టులు ఎందుకు వద్దన్నారు అని ప్రశ్నించారు.

పెట్టుబడిదారుల్లో అభద్రత నెలకొల్పడం, అయోమయం సృష్టించడం మంచిది కాదు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా పోటీ పట్ల నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎవరితో కలిసి పోటీ చేస్తామనే ప్రశ్నపై సమాధానం దాటవేశారు పవన్. పార్టీలో చర్చించాకే నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో పవన్ కామెంట్స్

ప్రజల్లో ఆవేశం, కోరిక లేకపోతే నేనొక్కడినే ఏమీ చేయలేను.

ప్రజలు కోరుకున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా నిలబడతా.

నా ఒక్కడి ఆరాటం - నా ఒక్కడి పోరాటం సరిపోదు.

తెలంగాణ ప్రజలు రాష్ట్రం కోసం పోరాడిన తీరు ఆదర్శం.


కాపు రిజర్వేషన్ విషయంలో 5 శాతం రద్దుపై పవన్ కామెంట్స్

అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లో వ్యవహరించినట్లే కాపు రిజర్వేషన్ పై వైసీపీ వ్యవహరించింది.

కాపులకు 5 శాతం ews రిజర్వేషన్ టీడీపీ పెట్టిందని వైసీపీ రద్దు చేసినట్లు అనిపిస్తుంది.

వైఎస్ జగన్ కాపుల రిజర్వేషన్ పట్ల రాజకీయ ప్రయోజనాలు చూసి మాట్లాడినట్లుంది.

ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి తప్ప, తప్పించుకుంటే సరికాదు.దీనిపై మరింత చదవండి :