మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (18:51 IST)

మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు: మంత్రి పేర్ని నాని

పంట కాలువ గట్లు తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. మంగళవారం ఆయన మచిలీపట్నం రోడ్లు ,భవనాల శాఖ అతిధి గృహం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతాపత్రాలు స్వీకరించారు.

బందరు మండలంలోని కొన్ని గ్రామాలలో కొందరు పంట కాలువ గట్లను తవ్వి మట్టిని అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం పట్ల మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చెశారు . నిబంధనలకు వ్యతిరేకంగా మట్టిని తొలగించి వ్యాపారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని,  రైతులు వారి సొంత పొలంతో ఎత్తు పల్లాలను సరిచేసుకునేందుకు ఎటువంటి ఫీజులు, అనుమతులు అవసరం లేదన్నారు. 

మండలంలో ఇప్పటి వరకు మట్టి తరలిం చేందుకు అమ్ము కునేందుకు ఎటువంటి దర ఖాస్తులు రాలేదని  దర ఖాస్తులు చేసి నట్లయితే నిబంధనల ప్రకారం అనుమతి మంజూరు చేయవచ్చన్నారు . చట్ట వ్యతిరేకంగా మట్టి అమ్మకాలు, రవాణా జరిపేందుకు అనుమతి లేదన్నారు. పద్దతిగా అనుమతులు పొంది మట్టిని తరలించాలని  ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తుంటే సంబంధిత రెవిన్యూ , గ్రామఅధికారులు, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.  

మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన వి భాగ్యలక్ష్మి మంత్రి పేర్ని నానికు మొరపెట్టుకొంది. ఇటీవల జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నర్సుల ఉద్యోగానికి ప్రకటన వెలువడిందని ఆ ఉద్యోగ విషయమై తనకు సహాయం చేయాలనీ అభ్యర్ధించింది. ఈ విషయమై  మీ అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులను సంప్రదించాలని ఆ ఉద్యోగాల నియామక ప్రక్రియ  డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పరిధిలోనిదని ఆమెకు వివరించారు. 

గుంటూరు నుంచి ఒక అజ్ఞాత వ్యక్తి మంత్రి పేర్ని నాని మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి కరోనా కారణంగా ఉద్యోగం ఉపాధి లేక  ఎంతో ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నానని దయచేసి 20 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేయాలనీ తన అకౌంట్ నెంబర్ మీకు పంపిస్తానని కోరాడు.

స్పందించిన మంత్రి అమ్మఒడి , డ్వాక్రా , చేయూత , ఆసరా డబ్బులేమీ మీకు పడలేదా అని ప్రశ్నించారు. మీ పరిస్థితి మీ ఎమ్మెల్యేకు ఎందుకు తెలియచేయలేదని అడిగారు. అయినా మీరు అడిగినంత ఇవ్వలేను కానీ మీపై సానుభూతితో కొంత మొత్తంలో ఆర్ధిక సహాయం చేస్తానని మీ వివరాలు మెసేజ్ పెట్టండని బదులిచ్చారు. 

స్థానిక పరాసుపేటకు చెందిన షేక్ ఖాసీం అనే నిరుద్యోగి మంత్రి పేర్ని నానిను కలిసి తన పరిస్థితి చెప్పుకొన్నారు. ఇటీవల లారీ డ్రైవర్ గా పనిచేసే తన తండ్రి గుండెపోటుతో మరణించారని తాను  బీకాం కంప్యూటర్స్ చదివేనని ఇటీవల కరోనా లాక్ డౌన్ లో చేస్తున్న చిన్న ఉద్యోగం పోయిందని తన తల్లి ,భార్య ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నట్లు తెలిపారు. తనకు డ్రైవింగ్ వచ్చని ఆ రంగంలోనైనా ఏదైనా డ్రైవర్ పోస్ట్ ఇచ్చినా చేస్తానని మంత్రికి షేక్ ఖాసీం మొర పెట్టుకొన్నాడు