బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (12:19 IST)

అమరావతిలో విద్యార్థుల నిరాహార దీక్ష భగ్నం

తుళ్లూరు మండలం వెలగపూడిలో రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ 151 గంటలు నిరాహారదీక్ష చేపట్టి దీక్ష చేస్తున్న ఇద్దరు యువకుల దీక్షను అర్థరాత్రి పోలీసులు భగ్నం చేశారు. 
 
రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరుకున్నాయి. మందడం తుళ్లూరు రాయపూడి తాడికొండ గ్రామాల్లో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
వెలగపూడిలో 55 వరోజు రిలేనిరాహారదీక్ష కొనసాగుతుంది. వెలగపూడిలో గత 5 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ఇద్దరు యువకులు బొర్రా రవిచంద్ర, తాడికొండ శ్రీకర్‌ల అప్పటికే 112 గంటలు పూర్తయిన నేపథ్యంలో దీక్షలను ఆదివారం అర్థరాత్రి పోలీసులు భగ్నం చేసి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 
 
తుళ్ళూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన డాక్టర్లు వెలగపూడిలోని దీక్షా శిబిరానికి వచ్చి దీక్ష చేస్తున్న ఇద్దరి యువకులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు గుర్తించారు. 
 
దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వారి దీక్షను భగ్నం చేసి చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సెలైన్ పెట్టి ప్రథమ చికిత్స అందిస్తున్నారు ఆ ఇద్దరి యువకుల పరిస్థితి విషమంగా ఉంది అనీ ఆందోళనలో ఉన్న రాజధాని 29 గ్రామాల ప్రజలు అమరావతి రైతులు మహిళలు కుటుంభ సభ్యులు జేఏసీ నాయకులు.