గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 10 మే 2021 (20:36 IST)

'స్వాతి' అసోసియేట్ ఎడిటర్ మణిచందన కన్నుమూత

స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మణిచందన క్యాన్సర్ పోరులో ఓడిపోయారు. కాసేపటి క్రితం కన్ను మూశారు. స్వాతి పబ్లిషర్, ఎడిటర్ శ్రీ వేమూరి బలరాం గారి కుమార్తె ఈమె. స్వాతి నిర్వహణలో ఈమె కీలకపాత్ర పోషిస్తున్నారు.
 
మణిచందన భర్త అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమీషనర్‌గా పని చేస్తున్నారు. మణిచందన వయసు 46 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. గత ఏడాదిగా ఆమె కేన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. వారం రోజుల క్రితం కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.