వైఎస్ జగన్‌కు సవాల్ విసిరిన చింతమనేని : దమ్ముంటే ఆ పని చేయించు...

chintamaneni prabhakar
ఠాగూర్| Last Updated: మంగళవారం, 16 జూన్ 2020 (10:27 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు. ఇటీవల ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో పాటు వాహనాల కొనుగోలు అంశంపై పార్టీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. తెదేపా నేతల అరెస్టును ఖండిస్తూ చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేశారు. దీంతో ఆయన్ను కూడా కూడా పోలీసుల్ అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనతో పాటు.. ఆయన అనుచరులను బెయిలుపై విడుదల చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు చింతమనేని సవాల్ విసిరారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే తన కేసును సీబీఐకి అప్పగించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కానీ, తెదేపా నేతలకు కష్టాలు సృష్టించడమే జగన్ ఏకైక లక్ష్యంగా ఉందన్నారు. ఇదే అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు.దీనిపై మరింత చదవండి :