గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (16:24 IST)

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ భార్యపై ఈసీకి ఫిర్యాదు!!

adimulapu suresh and wife
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి, కొండపి వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేశ్‌ భార్యపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన భార్య విజయలక్ష్మి వైకాపా అభ్యర్థుల తరపున నామినేషన్ వేయించడం, దగ్గరుండి అన్నీ పర్యవేక్షించడంపై విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కూటమి తరపున టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి, టీడీపీ నేత కొర్రపాటి వీరభోగ వంసతరాయలు మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన విజయలక్ష్మి తన భర్త ఆదిమూలపు సురేశ్ తరపున వైకాపా నాయకులతో కలిసి నామినేషన్ వేయించారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపించారు. 
 
ఒక ప్రభుత్వ అధికారి అయివుండి, వైకాపా నాయకులకు మద్దతుగా నామినేషన్ వ్యవహారాలు చూసుకోవడమేంటని వారు ప్రశ్నించారు. దీనిపై జిల్లా రిటర్నింగ్ అధికారి (కలెక్టర్)తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఐఆర్ఎస్ అధికారి విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. 
 
నిండు గర్భిణిని మంచానికి కట్టేసి నిప్పు పెట్టిన కసాయి భర్త!! 
 
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆరు నెలల గర్భంతో ఉన్న కట్టుకున్న భార్యను మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడో ఓ కసాయి భర్త. భార్యాభర్తల మధ్య తీవ్రవాగ్వాదం తర్వాత క్షిణికావేశంతో భర్త ఈ దారుణానికి తెగబడ్డాడు. మరో మూడు నెలల్లో కవల పిల్లలకు జన్మినివ్వాల్సిన ఆ గర్భిణి అర్థాంతరంగా తనువు చాలించింది. అమృతసర్ నగరానికి సమీపంలోని బుల్లెనంగల్ గ్రామంలో ఈ దారుణం శుక్రవారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మృతురాలు పంకీ, భర్త సుఖేవ్ మధ్య కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో సుఖేశ్ క్షిణికావేశంతో ఘోరానికి ఒడిగట్టాడు. పింకీ వయసు సంవత్సరాలు అని, ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అనంతరం పింకీని మంచానికి కట్టేసి నిప్పంటించాడని వివరించారు. సుఖ్‌దేవ్, పింకీల మధ్య విభేదాలు ఉన్నాయని, పలు విషయాలపై గొడవ పడేవారని పోలీసు అధికారులు చెప్పారు. 
 
శుక్రవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దారుణానికి ఒడిగట్టి సుఖ్‌దేవ్ పరారయ్యాడని అధికారులు వివరించారు. శనివారం సాయంత్రం సుఖ్‍‌దేవ్ అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఈ దారుణ ఘటనపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ కోరింది. ఈ ఘటనపై కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊహించలేని క్రూరత్వం ఇదని అభివర్ణించింది. ఈ ఘటనపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని పంజాబ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ లేఖ రాశారు. నేరస్థుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జాతీయ మహిళ కమిషన్ 'ఎక్స్' వేదికగా వివరాలను వెల్లడించింది.