సోమవారం, 10 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (19:06 IST)

దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు

durga laddu prasadam
బెజవాడలోని కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు కనిపించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెంట్రుకలు ఉన్న ప్రసాదాన్ని ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ప్రసాదంలో నాణ్యత లేదని, ఉదయం ఓ లడ్డూలో, సాయంత్రం మరో లడ్డూలోనూ వెంట్రుకలు కనిపించడంతో తాను నిర్ఘాంతపోయినట్టు ఆ భక్తుడు పేర్కొన్నారు. ఆ పోస్టులో మంత్రులు నారా లోకేశ్, దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి‌లను ట్యాగ్ చేశారు. 
 
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తుడు చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. భక్తుడుకి క్షమాపణ చెబుతూ, ఇలాంటి తప్పు మరోమారు పునరావృత్తం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.