సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (10:50 IST)

వైసీపీ రెబల్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్

komatireddysridhar reddy
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఆ ఆడియో ప్రకారం.. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికొస్తే బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య నుంచి లాక్కెళ్తా అంటూ బెదిరించారు. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరంలో లేదు. ఐదు నిమిషాల్లో వచ్చి లాక్కెళ్తా అని కోటంరెడ్డిని అనిల్ హెచ్చరించినట్లు కలదు.  
 
తనకు తాను వైసీపీ మద్దతుదారుడిగా చెప్పుకున్న అనిల్.. తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు.  మరోవైపు వైకాపా అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదయింది. 
 
తన అనుచరులతో కలిసి కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.