శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 4 జనవరి 2022 (14:01 IST)

లోయ‌లో శ‌వం... తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ హ‌త్య‌!

తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. ఎవ‌రు, ఎందుకు ఈ అఘాయిత్యం చేశారో అని టూరిజం అధికారులు, సిబ్బందితోపాటు స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, ఇది ఆర్ధిక లావాదేవీల కార‌ణంగానే జ‌రిగింద‌ని పోలీసులు చెపుతున్నారు. నిందితుల‌ను వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు.
 
 
 
తిరుపతిలో హత్య చేసి మృతదేహాన్ని భాకరాపేట ఘాట్ రోడ్డు లోయలో దుండ‌గులు ప‌డేశారు. మృతుడు తిరుపతికి చెందిన ఏపీ టూరిజంలో సూపర్ వైజర్ గా పనిచేసే చంద్రశేఖర్ గా గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలు కారణంగానే చంద్రశేఖర్ ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. హ‌త్య చేసిన నిందితులు మధు, రాజు, పురుషోత్తంలను అదుపులోకి తీసుకున్నారు.