శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:57 IST)

20 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. రోజూ సాయంత్రం 6.30 నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీదేవి, భూదేవిలతో కలసి గోవిందరాజస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

అనంతరం ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సంగీత, హరికథ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

వైభవంగా పురందరదాసు ఆరాధనోత్సవాలు..
పురందరదాసు ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన గురువారం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మయప్పస్వామిని ఊరేగింపుగా నారాయణగిరి పార్కులోని పద్మావతి పరిణయవేదికకు వేంచేపు చేశారు.

అక్కడ ఉత్సవమూర్తులకు ఊంజల్‌సేవ నిర్వహించారు. ఆ సమయంలో దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.