శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 జులై 2020 (20:43 IST)

22న విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

ఈ నెల 22న ఇబ్ర‌హీంప‌ట్నం జూపూడి వ‌ద్ద జ‌రిగే వ‌న మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హాజ‌రు కానున్నారు.

ఈ నేప‌‌ధ్యంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవిచంద్ర తెలిపారు. విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నందిగామలోనూ, గుంటూరు నుంచి వచ్చే వాహనాలను గుంటూరులోనే నిలిపివేయనున్నట్లు వెల్ల‌డించారు.