ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (22:49 IST)

కరోనా బాధితులకు అండగా టీటీడీ.. జర్మన్ షెడ్ల కోసం రూ.3.52కోట్లు

కరోనా బాధితులకు టీటీడీ అండగా నిలిచింది. ఇందులో భాగంగా టీటీడీ కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాలలో జర్మన్ షెడ్లు నిర్మించేందుకు రూ. 3.52 కోట్లు కేటాయించామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో 4, ప్రకాశంలో 2, అనంతపురంలో 3, క్రిష్ణాలో 3 ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
 
అలాగే కర్నూలులో 2, గుంటూరులో 3, కాకినాడలో 3 షేడ్లు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఒక్కో షేడ్లో 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. 
 
టీటీడీ సర్వశ్రేయో నిధి నుంచి నిధులు కేటాయించినట్టు ఆయన వివరించారు. ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.