1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (17:18 IST)

వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

Mekapati
Mekapati
ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. 
 
వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురైనట్లు తెలిపారు.  మెరుగైన చికిత్స కోసం మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డిని చెన్నై ఆస్పత్రికి తరలించారు. త్వరలో మేకపాటి ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదలయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.