గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (21:35 IST)

జగన్‌కు ఆ శక్తి ప్రసాదించమని శ్రీవారిని ప్రార్థించా: మంత్రి వేణుగోపాలక్రిష్ణ

తిరుమల శ్రీవారి ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు బిసి సంక్షేమ శాఖామంత్రి చెల్లబోయిన వేణుగోపాలక్రిష్ణ. ఆలయంలో టిటిడి అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
 
ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమానికి శక్తిని స్వామివారు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంచిపై చెడు ఎప్పుడు యుద్థం చేస్తూ ఉంటుందని.. మంచిని సంరక్షించేందుకు దైవాంశ అవసరమన్నారు.
 
పంచాయతీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో 95 శాతం సర్పంచులను గెలుచుకున్నట్లు.. అందుకే స్వామివారిని దర్సించుకున్నట్లు మంత్రి చెప్పారు. ఎపిలో సంక్షేమం, అభివృద్థి రెండూ పరుగులు పెడుతున్నాయన్నారు.