బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:44 IST)

విజయవాడ కార్పొరేషన్‌ టీడీపీదే: కేశినేని నాని

ఎంత మంది మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా విజయవాడ కార్పొరేషన్‌ టీడీపీదేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. 39వ డివిజన్‌ అభ్యర్ధి నూటికి నూరు శాతం శివశర్మే విజయం సాధిస్తారన్నారు. ఎటువంటి మార్పు లేదని... విజయవాడకు తాను.. రాష్ట్రానికి చంద్రబాబు అధిష్టానమన్నారు.

ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తు ఉంటాయి.. పోతూ ఉంటాయన్నారు. వైసీపీలో సఖ్యత ఉందా? అని ప్రశ్నించారు. నాలుగు పార్టీలు మారిన మంత్రి మాట్లాడటం విడ్డూరమన్నారు. చదువుకున్న అభ్యర్ధులపై 16 కేసులున్న స్టువర్టుపురం దొంగలను నిలుచోపెట్టే చరిత్ర వైసీపీదన్నారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను పెంచబోమన్నారు. గడచిన అయిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా పరిపాలన సాగించిన ఘనత టీడీపీదని ఎంపీ కేశినేని తెలిపారు.