గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (12:27 IST)

జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌కు ల‌క్ష్మీ కాసుల హారం బహుక‌ర‌ణ‌

విజయవాడ ఇంద్ర‌కీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు బుధ‌వారం ఉద‌యం కుటుంబ సభ్యులతో క‌లిసి ద‌ర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం నంబూరు శంకర్‌రావు దంపతులు అమ్మవారికి అలంకరణ నిమిత్తం త‌యారు చేయించిన 135 గ్రాముల బరువు గల బంగారు లక్ష్మి కాసుల హారాన్ని దేవస్థానం ఈవో ఎం.వి.సురేష్‌బాబుకు అంద‌జేశారు. 
 
అమ్మ‌వారికి బ‌హుక‌రించిన హారంలో రాళ్ళ సూత్రాలు బంగారు తీగతో చుట్టబడి ఉన్నాయ‌ని, అందులో 62 లక్ష్మి కాసులు, 142 తెలుపు రాళ్ళు, 2 ఎరుపు రాళ్ళు మరియు నాన్‌కోడ్ ఉన్నాయ‌ని దాత‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు కుటుంబ స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం గావించి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.