శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 27 డిశెంబరు 2021 (19:37 IST)

హ‌రిత విజ‌య‌వాడ‌ను సాధిద్దాం... ప‌ర్యావ‌ర‌ణం కాపాడుదాం...

ప్రతి ఒక్కరు పర్యావరణంపై భాద్యతగా ఉంటేనే హరిత విజయవాడ సాధించ గలమని విజ‌య‌వాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు.  సోమవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పున్నమి హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. కొత్త సంవ‌త్స‌రం శుభాకాంక్షలు తెలిపే వేళ ఒక మొక్కను బహుకరించుట అలవాటుగా మార్చుకోవాల‌న్నారు. 
 
 
పున్నమి ఘాట్ ను అధికారులతో కలసి అక్కడ భవాని భక్తులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు పరిశీలిస్తూ, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘాట్ల వద్ద నిరంతరం సిబ్బంది విధులలో ఉంచి, భక్తులు ఎవరూ వ్యర్ధములు, బట్టలు నదిలో పడవేయకుండా చూడాలని ఘట్  ఇన్ ఛార్జ్ అధికారులను ఆదేశించారు. 
 
 
రాజీవ్ గాంధీ పార్కులో ఆధునికీక‌ర‌ణ పనుల పురోగతిని అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ ఆవరణలో చేపట్టిన పనులు వేగవంతం చేసి, సత్వరమే పూర్తి చేసి సందర్శకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్క్ లో ఇంకా పూర్తి చేయవలసిన ఇంజనీరింగ్, గ్రీనరీ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప‌ర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ సి.హెచ్ శ్రీనివాసులు, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.