మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (12:09 IST)

కాల్ మనీ వేధింపులు.. వీఆర్వో గౌస్ ఆత్మహత్య

కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక విజయవాడ, ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన వీఆర్వో గౌస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గౌస్ ప్రస్తుతం కొండపల్లి గ్రామ విఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం గౌస్ కొంత అప్పు చేశాడు. 
 
నెల నెలా వడ్డీ డబ్బులు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. దీంతోపాటు ఆ డబ్బు చెల్లించాలంటూ వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. దీంతో ఈ చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన గౌస్ బలవన్మరణానికి పాల్పడటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.