ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , బుధవారం, 1 సెప్టెంబరు 2021 (10:51 IST)

విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల అటు - జ‌గ‌న్, భార‌తి ఇటు!

మొన్న సిమ్లా ఫ్యామిలీ టూర్ త‌ర్వాత వై.ఎస్.జ‌గ‌న్ కుటుంబం రాజ‌కీయంగా ఒక క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌పై రెండు ప‌డ‌వ‌ల‌పై కాలు వేయ‌కుండా, స్ప‌ష్ట‌మైన రాజ‌కీయాలు న‌డ‌పాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీనికి అనుగుణంగానే, ఇపుడు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో వైఎస్ విజయమ్మ ఉన్నట్టు తెలుస్తోంది. 
 
విజ‌య‌మ్మ ఇపుడు ఏపీలో వైసీపీకి గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. ఇక‌పై ఆమె ఈ పార్టీకి రాజీనామా చేసి, అక్క‌డ తెలంగాణాలో వైఎస్ఆర్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే అవ‌కాశం ఉన్నట్టు తెలుస్తోంది. కూతరు షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం విజయమ్మ వేగంగా పావులు కదుపుతున్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నోవాటెల్ హోట‌ల్ లో ముఖ్యనేతలతో ఆమె సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైఎస్సాఆర్ కి అతి దగ్గరగా ఉన్న నేతలకు ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. అక్కడే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం విజయమ్మ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు కాబ‌ట్టి, ఇలా రెండు వైపుల కాళ్ళు వేయ‌డం స‌రికాద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీని ప్ర‌కార‌మే విజ‌య‌మ్మ ఇక్క‌డ రాజీనామా ప్ర‌క‌టించి, అక్క‌డ పాగా వేస్తార‌ని స‌మాచారం. అంటే, ఇక ఇటు ఏపీలో సీఎం జ‌గ‌న్, భార‌తి, అటు తెలంగాణాలో విజ‌య‌మ్మ‌, ష‌ర్మిలా... ప‌క్కా క్లారిటీ పాలిటిక్స్ క‌దా!