శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:03 IST)

సీఎం జగన్ తల్లి విజయమ్మ విమానంలో... ఆకాశంలో చక్కర్లు కొడుతూనే వుంది...

తెలుగు రాష్ట్రప్రజలకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం గురించి తెలుసు. హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్.ఆర్. మృతి చెందారు. ఆయన మృతికి పలు కారణాలున్నాయని అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయి చివరకు వై.ఎస్.జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే.
 
అయితే తాజాగా జరిగిన సంఘటన వైసిపి నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విజయమ్మ ప్రయాణీస్తున్న విమానం వర్షం కారణంగా ల్యాండ్ కాలేదు. దీంతో విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ రోజు మధ్యాహ్నం ఇండిగో విమానంలో బయలుదేరారు వై.ఎస్.విజయమ్మ. 
 
గన్నవరం విమానాశ్రయం వద్దకు రాగానే భారీ వర్షం పడుతుండడంతో పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయలేదు. ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయం చుట్టూ మూడు చక్కర్లు కొట్టింది విమానం. అయితే విమానాన్ని కిందకు దించేందుకు పైలెట్ ప్రయత్నిస్తున్నాడు.