గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపా ప్లీనరీకి తుపాకీతో వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు

handgun
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు గుంటూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగాయి. ఈ ప్లీనరీకి కర్నూరు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం, జడ్పీటీసీ ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి చేతిలో తుపాకీతో వచ్చిన కలకలం రేపారు. 
 
ఆయన తొలి రోజు అయిన శుక్రవారం ప్లీనరీకి హాజరయ్యే సమయంలోనే తుపాకీని తన వెంట తెచ్చుకున్నరు. ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని, మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. 
 
ఆ తర్వాత ఆ తుపాకీకి లైసెన్సు తదితర వివరాలను సేకరించిన తర్వాత ప్లీనరీ తర్వాత స్టేషన్‌కు వెళ్ళి తీసుకోవాలని ఆయనకు పోలీసులు సూచించారు. దీనిపై చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్లవేళలా తన వెంట తుపాకీ ఉంటుందన్నారు. కారులో విడిచిపెట్టి రావడం క్షేమం కాదని భావించి తన వెంట తెచ్చుకున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత తుపాకీని ఆయనకు అప్పగించారు.