మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (09:34 IST)

03-09-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించినా...

మేషం : ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. బంధుమిత్రుల వైఖరిలో మార్పును గమనిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. 
 
వృషభం : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దైవకార్య సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యం వైపు దృష్టిసారిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
మిథునం : స్త్రీలపై ఆత్మీయుల హితోక్తులు బాగా పనిచేస్తాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు, నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తాయి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బకాయిలు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. 
 
కర్కాటకం : దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వాదోపవాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన ధనం అందడం వల్ల పాత బాకీలు తీరుస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. శత్రువులు, మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. 
 
సింహం : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎదుటివారితో సంభాషించేటపుడు మెళకువ అవసరం. అప్రయత్నంగా కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
కన్య : ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల చికాకులు, పనిభారం తప్పవు. రావలసిన ధనం అందడంతో పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. 
 
తుల : ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి. కోళ్లు, మత్స్యు, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ, చెల్లింపుల్లోనూ అప్రమత్త చాలా అవసరం. 
 
వృశ్చికం : విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత పురోభివృద్ధి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. ఒంటెత్తు పోకడ మంచిదికాదు అని గమనించండి. 
 
మకరం : విద్యార్థులకు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం ఒకందుకు మంచిదే. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. ఒకేసారి అనేక పనులు మీపడటంతో అసహానికి లోనవుతారు. 
 
కుంభం : జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. 
 
మీనం : విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికిమాటికి అసహనం ఎదుర్కొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు.