ఆదివారం, 26 మార్చి 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 03-02-2023 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో పూజించి...

Leo
మేషం :- గిట్టనివారికి హితవు చెప్పి భంగపాటుకు గురవుతారు. ప్రముఖులతో పరిచయాలు, తరుచువిందులు వంటి శుభ సంకేతాలున్నాయి. దంపతుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్లసమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటంమంచిది.
 
వృషభం :- బ్యాంక్ వ్యవహారాలో చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందకొడితనం వల్ల చికాకులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. రియల్ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో మెళుకువ అవసరం. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులవల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.
 
కర్కాటకం :- మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
సింహం :- స్త్రీలకు తల, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. విద్యార్థులకు ఒత్తిడి అధికమవుతుంది.
 
కన్య :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమతత్తత అవసరం. స్త్రీల సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం నుండి వ్యతిరేకత, సమన్వయ లోపం ఎదుర్కొనవలసివస్తుంది.
 
తుల :- ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. అనుక్షణం భాగస్వామికుల తీరును గమనించటం శ్రేయస్కకరం.
 
ధనస్సు :- ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఇరుగుపొరుగు విరితో సఖ్యత అంతగా ఉండదు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. 
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కొంతమంది మీతీరును అనుమానించే ఆస్కారం ఉంది. ప్రముఖుల కలయిక వల్ల నూతన పరిచయాలేర్పడతాయి. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. రుణయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు.
 
కుంభం :- మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. ఆత్మీయుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మీనం :- కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దుబారా ఖర్చులు అధికం. స్త్రీలు ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత వంటి చికాకులు తప్పవు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారంఉంది.