సోమవారం, 2 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 01-02-2023 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని పూజించిన....

Gemini
మేషం :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. కార్యసాధనలో జయం పొందుతారు. ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
వృషభం :- రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. వ్యాపారంలో పెరిగిన పోటీని తట్టుకోవడానికి అహర్నిశలూ శ్రమిస్తారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల దృష్టి సాధిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయ కార్యార్థం ప్రయాణం చేయవలసివస్తుంది. ఓర్పు, సహనం, శాంతి కలిగి ఉండుట మంచిది.
 
మిథునం :- వస్త్ర వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. పనులు మొదట్లో మందగించినా క్రమేపి పూర్తిగా కాగలవు. కుటుంబీకులతో కలసి దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థినులకు ధ్యేయం పట్ల అవగాహన, కొత్త విషయాలపై ఆసక్తి నెలకొంటాయి. 
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల ప్రశంస లందుకుంటారు. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం, గ్రహింపు శక్తి తక్కువగా ఉండటం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
సింహం :- ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కొద్దిపాటి ధనసహాయం చేసి మీ సంబంధాలు చెడకుండా చూసుకోండి. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరిస్తే మంచిది.
 
కన్య :- రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఆవగాహన లోపిస్తుంది. కీలకమైన వ్యవహరాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
 
తుల :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. అనుకున్న పనులు తక్షణం పూర్తికాగలవు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం లోపిస్తుంది. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత చాలా అవసరం.
 
వృశ్చికం :- టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. భాగస్వామిక వ్యవహారాలకు స్వస్తి చెప్పటం క్షేమదాయకం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారస్థులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
 
ధనస్సు :- కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఉపాధి పధకాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఉపాధ్యాయులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసివస్తుంది. బంధువులమధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మకరం :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబలో మానసిక విజ్ఞతయుతంగా ఒక సమస్యను పరిష్కరిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటంమంచిది.
 
కుంభం :- అనుకోని ఖర్చులు ఎదురైనా ధనానికి ఇబ్బందు లుండవు. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన తమ లక్ష్యం సాధించగలరు. క్రయ విక్రయాలు వాయిదాపడుట మంచిది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించి ఇబ్బందులెదుర్కుంటారు.
 
మీనం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి నెలకొంటుంది. పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయం తోడవుతుంది.