బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (07:57 IST)

14-04-2024 ఆదివారం దినఫలాలు - వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి...

kanya rashi
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. కుటుంబీకులమధ్య అనురాగ వాత్సల్యాలు, సత్సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది.
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. వృత్తి, ఉద్యోగస్తులకు చికాకులు తప్పవు. బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి.
 
మిథునం :- తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభించినా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. విద్యార్థినులు పట్టుదలతో శ్రమించి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధన వ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. 
 
కర్కాటకం :- ఒక కార్యార్ధమై దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. ధనం మితంగా వ్యయం చేయండి. విదేశీయానం కోసం చేసే యత్నాలకు మార్గం సులభమవుతుంది. ఉన్నత స్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
సింహం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకోవటం కష్టమవుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి. ప్రైవేటు, పత్రికా రంగాల్లో వారికి అధికారులతో సమస్యలను ఎదుర్కొంటారు.
 
కన్య :- ఉద్యోగస్తుల తొందరపాటు తనం వల్ల అధికారులతో మాటపడక తప్పదు. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు అధికారులు నుండి ఒత్తిడి, కార్మిక సమస్యలు తప్పవు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకొండి.
 
తుల :- పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులు గట్టిపోటీ ఎదుర్కోవలసి వస్తుంది.
 
వృశ్చికం :- ముఖ్యులపట్ల ఆరాధన పెరగగలదు. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఎక్స్‌పోర్టు రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తప్పవు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకువస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మకరం :- గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి అవకాశం ఉంది. స్త్రీలకు చుట్టుప్రక్కల వారితో సమస్యలు తలెత్తగలవు. సినిమా, విద్యా, సాంస్కృతిక రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, హోటల్, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు.
 
కుంభం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెర్టర్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రియతములలో మార్పు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతోముఖ్యం.
 
మీనం :- ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తులు బాధ్యతా యుతంగా వ్యవహరించడం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు పనివారాలతో ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కుంటారు. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు.