ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-08-2022 శుక్రవారం దినఫలాలు - పార్వతీదేవిని పూజిస్తే వాంఛలు నెరవేరుతాయి...

weekly astro
మేషం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. రావలసినమొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
వృషభం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. విద్యార్థులు ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
మిథునం :- ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడక తప్పదు. ముఖ్యుల ఆరోగ్యం మిమ్ములను నిరాశపరుస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు అన్ని విధాలా శుభదాయకం.
 
కర్కాటకం :- స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థినులకు ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అవకాశం లభిస్తుంది. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయంకావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
సింహం :- ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనివ్వగలవు.
 
కన్య :- ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ఆత్మీయులకు ఆపత్సమయంలో అండగా నిలుస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆధ్మాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల :- అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్త్రీలు దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పాత మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
వృశ్చికం :- కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పాత మొండి బాకీలు వసూలవుతాయి. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలుంటాయి. కొంతమంది మీ నుంచి ధనసహాయం లేక ఇతరత్రా సాయం అర్థిస్తారు. అన్ని వ్యవహరాల్లో జయం లభిస్తుంది. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. వృత్తులు వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
మకరం :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారితత్వన్ని గమనించండి.
 
కుంభం :- విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెస్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక విషయాలు, దాన ధర్మాలకు ఖర్చులు చేస్తారు.
 
మీనం :- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సివస్తుంది. స్త్రీలకు అసహనం, నిరుత్సాహం, ఏ విషయంపట్ల ఆసక్తి ఉండకపోవటం వంటి చికాకులు ఎదురవుతాయి.నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.