సోమవారం, 4 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (09:39 IST)

06-10- 2024 నుంచి 12-10-2024 వరకు మీ వార రాశి ఫలాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదివారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభయోగం. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవదు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయజాలవు. దైవదర్శనాల్లో అవస్థలెదుర్కుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్మోనుఖులను చేస్తాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపుధనం ముందుగానే గ్రహిస్తారు. పెట్టుబడులు కలిసిరావు. బుధవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కీలక పత్రాలు, నగదు జాగ్రత్త. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. తరుచు ఆత్మీయులతో సంభాషిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా మెలగండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. కీలక వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. పెద్దల సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. గురువారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా కార్యక్రమాలు కొనసాగిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అవివాహితులకు శుభయోగం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసస్తం చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహబలం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ముఖ్యుమైన వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవప్రతిష్టలకు భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. సంతానానికి అన్ని విధాలా యోగదాయకం. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆప్తుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అపజయాలకు కుంగిపోవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యతిరేకుల తీరు ఆందోళన కలిగిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఇంటి విషయాల పట్ల అలక్ష్యం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు మెరుగుపడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సామర్ధ్యంపై అవతలివారికి గురి కుదురుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. శనివారం నాడు ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులు, సంస్థల స్థాపనలకు తరుణం కాదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొందరి మాటతీరు కష్టమనిపిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మిమ్ములను తప్పుపట్టిన వారే మీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉన్నతాధికారులకు కష్టకాలం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యం నెరవేరుతుంది. అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆత్మీయుల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరాశకలిగిస్తుంది. ఏది జరిగినా మంచికేనని భావించండి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ రంగంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. సే విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. విమర్శించిన వారే మీ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బుధ, గురువారాల్లో అందరితోను మితంగా సంభాషించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. శుక్రవారం నాడు బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యతలోపం. సామరస్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉన్నతాధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆశాజనకం.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. సంతానం వైఖరి అదుపుచేయండి. గృహమార్పు అనివార్యం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. మీ సమర్థతపై అధికారులకు గురికుదురుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపునకు అవకాశం లేదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు మొండిగా సాగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ కలిసివస్తుంది. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్తులకు ఆదాయం బాగుంటుంది.