ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్

01-07-2024 నుంచి 31-07-2024 వరకు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబీకులతో చర్చలు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆవేశపూరిత నిర్ణయాలు తగవు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. అవివాహితులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు ఓర్పు, అంకితభావం ప్రధానం. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిరువ్యాపారులకు బాగుంటుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మీ కష్టం వృధాకాదు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెద్ద మొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. పరిచయాలు బలపడతాయి. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. మీ విషయాల్లో ఇతరులు జోక్యానికి తావివ్వవద్దు. సంతానం భవిష్యత్తు కోసం శ్రమిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలున్నాయి. పురస్కారాలు అందుకుంటారు. ఉన్నతాధికారులకు హోదామార్పు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూలతలు అంతంతమాత్రమే. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితులు వ్యాఖ్యలు మీపై సత్‌ ప్రభావం చూపుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం సామాన్యం, పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం చేజారిపోతుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలం. ఆటంకాలను సమర్థంగా ఎదుర్కుంటారు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ద్వితీయార్ధం నిరాశాజనకకం. అవకాశాలు చేజారిపోతాయి. సోదరులతో విభేదిస్తారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. గృహమార్పు అసౌకర్యం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానచలనం. ప్రయాణం కలిసివస్తుంది. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా యోగదాయకం. మీదైన రంగంలో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. కీలక పత్రాలు అందుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. అవివాహితులకు శుభయోగం. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానానికి ఉన్నత విద్యా యోగం. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
ఈ మాసం అనుకూలదాయకం. శ్రమతో కూడిన విజయాలు సాధిస్తారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కొన్ని సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటేపడతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. సోదరీ సోదరుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒత్తిడి ఒత్తిడి పెరుగకుండా చూసుకోండి. అనుమానాలకు అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా అడుగు ముందుకేయండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మీ సమస్య సన్నిహితులకు తెలియజేయండి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలున్నాయి. శ్రమతో కూడిన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. స్థిరాస్తి విక్రయాలకు తరుణం కాదు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. సంతానానికి శుభయోగం. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు బాధ్యతల మార్పు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. అవివాహితులకు శుభయోగం. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సంతానం మొండితనం చికాకుపరుస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. అయిన వారితో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. సోదరీ సోదరులతో సఖ్యత నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఓర్పుతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.